calender_icon.png 26 April, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృక్షాన్ని తొలగించి.. మరో చోట నాటి

25-04-2025 11:42:39 PM

రోడ్డుకు అడ్డంగా ఉన్న వృక్షం తరలింపు...

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): రోడ్డుకు అడ్డంగా ఉన్న ఓ వృక్షాన్ని ట్రాఫిక్ పోలీసులు కూకటి వేళ్లతో తొలగించి.. మరో చోట నాటారు. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి ఏవోసి గేటు వద్ద రోడ్డుపై ఓ భారీ వృక్షం ఉండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌రాజ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆ భారీ వృక్షాన్ని జేసీబీ సాయంతో కూకటి వేళ్లతో తొలగించి, ఏవోసీ గేట్ ఆర్మీ ప్రాంతంలో నాటారు. ఈ సందర్భంగా ఆ వృక్షానికి పోలీసులు పూజలు చేశారు. ఆ చెట్టును తొలగించడంతో ఈసీఐఎల్, సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఖార్ఖానా ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించేవారికి మార్గం సుగమమైంది.