12-04-2025 12:23:07 AM
కేర్ హాస్పిటల్‌లో సోమాలియా రోగికి క్లిష్టమైన శస్త్రచికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ వైద్య నిపుణు లు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమాలియాకు చెందిన 26 ఏళ్ల గులెమ్ మొహమద్ హెర్సీ అనే యువకుడి మెదడులో ఉన్న తుపాకీ బుల్లెట్‌ను శస్త్రచికిత్స ద్వారా సురక్షితంగా తొలగించా రు. తుపాకీ గాయం కారణంగా ఆయన స్వదేశంలోనే గాయపడగా, హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
పేషెం ట్ కోమాలో ఉండి, చేతులు, కాళ్లలో బలహీనతతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా, న్యూరోసర్జన్ డా. లక్ష్మినాథ్ శివరాజు నేతృత్వంలోని బృందం శస్త్రచికిత్సకు సిద్ధమైంది. బుల్లెట్ మెదడులో చాలా సున్నితమైన ప్రాంతంలో ఉంది. చిన్న పొరపాటు కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్టపరిస్థితిలో సురక్షితంగా బుల్లెట్‌ను తొలగించామని డా. శివరాజు తెలిపా రు. ఈ శస్త్రచికిత్స భారతదేశంలోనే అరుదైనది.
శస్త్రచికిత్స అనంతరం పేషెంట్ ఆరోగ్యంలో వేగంగా మెరుగుదల కనిపించి, నెమ్మదిగా కోలుకుంటున్నాడు. కేర్ హాస్పిటల్స్ బృందం నాకు కొత్త జీవితం ఇచ్చింద ని రోగి గులెమ్ అన్నాడు. కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ సీఓఓ నిలేశ్ మాట్లాడుతూ.. ఇలాంటి క్లిష్టమైన కేసులు తమ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణుల నైపుణ్యాన్ని చూపిస్తాయన్నారు.