calender_icon.png 21 October, 2024 | 5:19 PM

యుద్ధకాండను తలపించే

20-10-2024 12:00:00 AM

జై భజరంగభళీ

అజయ్ దేవ్‌గన్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన చిత్రం ‘సింగమ్ అగైన్’. అక్షయ్‌కుమార్, రణ్ వీర్ సింగ్, ట్కెగర్ ష్రాఫ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘సింగం’కు సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామాయణం ఆధారంగా చేసుకొని రూపొందిన ఈ చిత్రం నుంచి శనివారం ఫస్ట్ సింగిల్‌గా ‘జై భజరంగభళీ’ని విడుదల చేశారు. భక్తిరస పూర్వకంగా సాగుతున్న ఈ పాట ఆద్యంతం భక్తి సాగరంలో ఓలలాడింపజేస్తోంది. రౌద్రాన్ని ప్రదర్శిస్తున్న విజువల్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. రామాయణంలోని యుద్ధకాండను తలపిస్తున్నాయి. స్వానంద్ కిర్కిరే గీత సాహిత్యం అందించగా, మణికందన్ సంగీత సారథ్యం వహించారు. శ్రీకృష్ణ, కరీముల్లా, అరుణ్ కౌండిన్య, చైతు సత్సంగి, శ్రీసాయి చరణ్, సుధాంశు, రితేశ్ జి రావు, సాత్విక్ జి రావు, పృథ్వీ చంద్ర, లక్ష్మీనాయుడు, అద్వితీయ, శ్రుతి రంజని, ప్రణతి, ఐశ్వర్య దరూరి, సాహితీ చాగంటి, మనీషా పాండ్రంకి, శ్రుతిక, లక్ష్మీ మేఘన, నాదప్రియ, వాగ్దేవి ఆలపించారు.