నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘35 కథ కాదు’. నంద కిషోర్ దర్శకత్వంలో సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్స్ కంటెంట్ ప్రేక్షకాదరణ పొందగా, తాజాగా మేకర్స్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ‘సయ్యారే సయ్యా..’ అంటూ సాగుతూ ఫ్రెండ్‌షిప్ సెలబ్రేట్ చేసుకునే ఈ పాటను వివేక్ సాగర్ కంపోజ్ చేశారు. కిట్టు విస్సా ప్రగడ రాసిన ఈ గీతాన్ని కార్తీక్ పాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను, స్నేహం తాలూకు అనుభూతులను గుర్తుకు తెస్తోందీ పాట. ఈ మూవీలో స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ నెల 15న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.