calender_icon.png 15 January, 2025 | 11:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

10-09-2024 05:06:55 PM

దుబ్బాక,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ  వర్ధంతి సందర్భంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతూ... ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాటాలు చేశారని, విసునూర్ దొర అరాచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి తరం మహిళా నాయకురాలు కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా చేరి భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని గుర్తు చేశారు. రజాకారుల ఆధ్వర్యంలో పటేల్ పట్వారి విధానాన్ని వ్యతిరేకిస్తూ బాంచన్ కాల్మొక్త అనే బానిసత్వాన్ని నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తికి రావాలని, దున్నేవాడికే భూమి కావాలని జరిగిన పోరాటంలో పాల్గొన్న మహాయోధరాలు ఐలమ్మ అని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక మండల నాయకులు కొంపల్లి భాస్కర్, మల్లేశం, సాజిద్ ,ప్రశాంత్, నర్సింలు, షాదుల్లా ,అల్లావుద్దీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.