06-04-2025 12:07:12 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం పోరాడిన యోధుడు, స్వాతంత్య్రం కోసం నినదించిన భారత ఉపప్రధాని డా.బాబూజగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. సమసమాజం కోసం మనమందరం కలిసి పనిచేయడమే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అన్నారు. శనివారం డా.బాబూజగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. కార్మిక శాఖ లో క్యాబినెట్ మంత్రిగా జగ్జీవన్‌రామ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.