calender_icon.png 7 March, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి విక్రయదారుల రిమాండ్

07-03-2025 12:28:01 AM

నాగర్ కర్నూల్, మార్చి 6 (విజయక్రాంతి): నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు నాగర్ కర్నూల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య మీడియాకు వివరించారు.

నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు నిఘా ఉంచి గురువారం వసంతాపూర్ గేటు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు మెగా కంపెనీలో పని చేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బిట్టు కుమార్ రావు అదే కంపెనీలో పని చేస్తున్న పప్పు కుమార్, మహేష్, దుర్గాప్రసాద్, ఉదయ్ వంటి వారికి అధిక ధరకు ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

వారి నుండి 909 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాదినం చేసుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు సిఐ కనకయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ రాజశేఖర్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.