calender_icon.png 22 April, 2025 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతోన్మాద పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించాలి

21-04-2025 12:30:52 AM

 ఐద్వా రాష్ట్ర జాత సభలో  జాతీయ నాయకురాలు  జ్యోతి 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 20 ( విజయ క్రాంతి ): తెలంగాణ సాయుధ పోరాటం నడిపి నిజాం రజాకార్ ల , దొరల తరిమిన గడ్డపై తులసి వనంలో గంజాయి మొక్కల లాగా మతోన్మాద పార్టీలు పాగా వేయడంకోసం ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీలను  కూకటివేళ్లతో పెకిలించివేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) జాతీయ నాయకురాలు జ్యోతి   పిలుపునిచ్చారు.

మహిళా హక్కుల పరిరక్షణ కోరుతూ ఐద్వా రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర యాత్ర  యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా అంబేద్కర్ విగ్రహం నుండి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రిన్స్ చౌరస్తాలో ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన సభ  నిర్వహించారు .

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు , హింస పెరిగిందని బీజేపీ పాలిత మణిపూర్ రాష్ట్రం నడి బజారులో భారత మతాలను నగ్నంగా ఊరేగించిన ఘటన యావత్ దేశం సిగ్గుతో తలదించుకుందని గుర్తుచేశారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్  బ్యూరో సమాచారం ప్రకారం  రోజు 86 మంది మహిళలపై అఘాయ త్యాలు జరుగుతున్నాయని,దేశంలో  ప్రతి 17 నిమిషాలకు ఒక భారత మాతపై అఘాయిత్యం జరుగుతున్నదని బిజెపి పాలనకు ఈ ఘటనలే నిదర్శనమన్నారు. రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షులు, బిజెపి నాయకులు బ్రీజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ కనీసం అతనిని  బిజెపి  మోదీ ప్రభుత్వం శిక్షించ లేదని ఇది బిజెపి నిజస్వరూపమని తెలియ జేశారు.

ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అరుణ జ్యోతి , మల్లు లక్ష్మి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బుగ్గవీటి సరళ గారు  మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కావాలని మనువాద సిద్ధాంత  బిజెపి చెప్తుందని కానీ నేడు కాలం మారిందని మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలియజేశారు.

మోడీ ప్రభుత్వం మహిళల శ్రమ దోపిడీ కోసం 12 గంటలు లేబర్ కోడ్ ల రూపంలో తీసుకొచ్చారని దీనికి వ్యతిరేకంగా మహిళలు హక్కుల కోసం ఎనిమిది గంటల పని కోసం సావిత్రి బాయిపూలే స్ఫూర్తితో  ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశాలత గారు , జిల్లా అధ్యక్షురాలు రామేశ్వరి , జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి లు పాల్గొనగా ఐద్వా జాతాకు సంఘీభావంగా వ్యకాస జిల్లా కార్యదర్శి కొండమడుగు నర్సింహ , రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజ్ గౌడ్ , సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , సిఐటియు టౌన్ కార్యదర్శి గంధమల్ల మాతయ్య, యస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి లావుడ్య రాజు , పియన్ యం జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ , వివిధ సంఘాల నాయకులు సంపూర్ణ మద్దత్తు ప్రకటించారు.ఈ సభలో ఐద్వా జిల్లా కమిటి సభ్యులు మాయ రాణి, దొడ్డి అండాలు, ఆవుల కళమ్మ , యండి రేష్మ తదితరులు పాల్గొన్నారు.