calender_icon.png 12 January, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘యోగా’తో మానసిక ఒత్తిడి దూరం

05-01-2025 12:00:00 AM

ఎస్‌పీ అఖిల్ మహాజన్ 

సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి) : నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు నిత్యం యోగా సాధనతో మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని, నిత్యజీవితంలో యోగ ఒక అలవాటుగా మార్చుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద యోగా కార్యాక్రమాన్ని నిర్వహించి, యోగా నిపుణులచే పోలీస్ అధికారులకు, సిబ్బందికి యోగాలో శిక్షణనిచ్చారు.

ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణ లో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు.ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది,అధికారులు ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని,  మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకో వాల న్నారు.ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక,వ్యాయామం,యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని, వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మేలు చేస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్  పేర్కొన్నారు.ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, సి.ఐ లు మొగిలి,మధుకర్, శ్రీనివాస్,ఎస్.ఐ లు ఆర్.ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.