14-03-2025 11:42:42 PM
బెంగళూరు: మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంమానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఒక బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు స్వల్ప ఊరట లభించింది. మార్చి 15న పోక్సో కేసు విచారణకు హాజరుకావాలని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఇటీవల ఆయనను ఆదేశించింది. తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది. 17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక మోసం కేసులో తమకు సాయం చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లి గతేడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు.
ఈ సమయంలో తన కుమార్తెను బీజేపీ నేత బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ ఆరోపణలను యడియూరప్ప కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేశారని పేర్కొంది. ఇటీవలే తనపై పోక్సో కేసును కొట్టేయాలని యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. బాలికపై దాఖలైన లైంగిక వేధింపుల అంశంలో పోక్సో కేసును కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలోనే కేసును తిరిగి ట్రయల్ కోర్టుకు పంపించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.