న్యూఢిల్లీ, నవంబర్ 26: స్పెక్ట్రం కొనుగోలు చేసేందుకు టెలికాం కంపెనీలు బ్యాంక్ గ్యారం టీలను సమర్పించాల్సిన అవసరం లేదంటూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయించంతో వోడాఫోన్ ఐడియాతో సహా వివిధ కంపెనీలకు ఊరట లభించింది.
గతంలో స్పెక్ట్రం పొందిన టెలికాం కంపెనీలు 2022 నుంచి కొనుగోలు చేసిన స్పెక్ట్రంకు, ఇకముందు జరిగే స్పెక్ట్రం వేలాలకు బ్యాంక్ గ్యారంటీల నుంచి మినహా యింపు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినందున, టెలికాం కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
దీంతో తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియాకు ఊరట లభించింది. ఈ వార్తతో మంగళవారం ఐడియా షేరు ఇంట్రాడేలో 18 శాతం వరకూ ర్యాలీ చేసింది. చివరకు 8 శాతం లాభంతో ముగిసింది.