ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు కొట్టివేత
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుం డా నిరాహారదీక్ష చేశారంటూ నమోదైన కేసులో వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది.
వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా నిరాహారదీక్ష చేపట్టి ఎన్నికల నిబంధనలను ఉల్లం ఘించారని మాచినీల్ల రాంబాబు చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసును కొట్టేయాలని స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారించారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన కేసు లో ఇదే హైకోర్టు గతంలో చెప్పిన తీర్పు మేరకు పిటిషన్‌పై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు.
స్పీకర్‌పైన నమో దైన కేసు ప్రస్తుతం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉంది. ప్రజా ప్రతినిధుల కోర్టులోని కేసును కొట్టేయాలంటూ స్పీకర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సోమవారం జస్టిస్ కే లక్ష్మణ్ విచారణ జరిపారు. న్యాయవాది వాదిస్తూ.. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగిన నిరాహార దీక్షలో పిటిషనర్ గడ్డం ప్రసాద్ పాల్గొనలేద ని అన్నారు.
తప్పుడు సమాచారం చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని చెప్పా రు. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో కూడా పిటిషనర్ ఏ నిబంధనలను ఉల్లంఘించారో కూడా లేదని పేర్కొన్నారు. పిటిష నర్‌పైన కేసును కొట్టేయాలని కోరారు. వాదనల అనంతరం పిటిషనపై ఉన్న కేసు ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీచేసింది.
9 వరకు హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో హైకోర్టు ఆదేశం
తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్‌గౌడ్ హైదరాబాద్, పంజాగుట్ట పోలీ స్టేషన్లలో చేసిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో బీఆర్‌ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును జనవరి 9 వర కు అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నెల 30 వర కు అరెస్టు చేయరాదన్న ఆదేశాలను సోమవారం పొడిగించింది. రాజకీయ కక్షతో రియల్ ఎస్టేట్ వ్యాపారి జీ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనపై తప్పుడు కేసు నమోదైందని, దీనిని కొట్టేయాలని హరీశ్‌రావు గతంలోనే పిటి షన్ దాఖలు చేశారు.
దీనిని ఈ నెల 5న విచారించిన హైకోర్టు.. ఈ నెల 30 వర కు హరీశ్‌రావును అరెస్టు చేయరాదని చెప్పింది. పిటిషన్ సోమవారం మరోసా రి విచారణకు వచ్చింది. కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ప్రతివాదులు కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణను ఈ నెల 9కి వాయిదా వేశారు. అప్పటి వరకు అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులు అమల్లో ఉంటా యని చెప్పారు.