calender_icon.png 18 April, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్‌తో నిరుపేదలకు ఊరట

29-03-2025 12:00:00 AM

ఖమ్మంరూరల్, తిరుమలాయపాలెం మండల లబ్ధిదారుల చెక్కుల పంపిణీలో వక్తలు

ఖమ్మం, మార్చి 28 ( విజయక్రాంతి ):- సీఎం రిలీఫ్ ఫండ్ తో నిరుపేదలకు ఎంతో ఊరట కలుగుతోందని, అనారోగ్యంతో సతమతమవుతూ వైద్యం చేయించుకోవటానికి ఇబ్బంది పడుతున్న ఎన్నో కుటుంబాలకు ఆర్థిక చేయూత కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.

పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండల లబ్ధిదారుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగింది. ఖమ్మం రూరల్ మండలంలో 31మంది లబ్దిదారులకు రూ. 9,33,500 విలువ చేసే చెక్కులను, తిరుమలాయపాలెం మండలంలో 24మంది లబ్దిదారులకు రూ. 5,91,500 విలువ చేసే చెక్కులను అందించారు.

ఈ సందర్భంగా చెక్కుల పంపిణీ అనంతరం వక్తలు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి సిఫారసుతో నియోజకవర్గానికి చెందిన అనేక మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు అనతి కాలంలోనే చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆయన నేతృత్వంలో పాలేరు నియోజకవర్గం కొత్త పుంతలు తొక్కుందని అభివర్ణించారు.

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కావాల్సిన సౌకర్యాలను సమకూర్చేందుకు మంత్రి పొంగులేటి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, ధరావత్ రామ్మూర్తి నాయక్, మద్ది మల్లా రెడ్డి, నాగండ్ల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు బెల్లం శీను, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ , మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు జడల నగేష్ గౌడ్, కర్లపూడి భద్రకాళి, భూక్య సురేష్ నాయక్, వెంపటి రవి, సుధాకర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, తాటికొండ కిరణ్, మెండె వెంకటేష్ యాదవ్, రానేరు యాదగిరి, రానేరు మురళి తదితరులు పాల్గొన్నారు.