calender_icon.png 13 January, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెయిల్‌పై విడుదలైన నిందితులకు ఊరట

10-07-2024 12:05:00 AM

  • వారి గూగుల్ మ్యాప్ లొకేషన్ అడగరాదని సుప్రీంకోర్టు తీర్పు 
  • ఇది వ్యక్తుల గోప్యతా హక్కును ఉల్లంఘించినట్లేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూలై 9: వ్యక్తిగత స్పేచ్ఛ, గోప్యత విషయంలో సుప్రీం కోర్డు కీలక తీర్పు వెలువరించింది. బెయిల్‌పై విడుదలైన నిందితులు తమ గూగుల్ మ్యాప్స్ లొకేషన్‌ను షేర్ చేయమని ఆదేశించడం వారి గోప్యతా హక్కును ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ఎస్ ఓకా, ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. బెయిల్ షరతుల్లో ఉన్న ఈ నిబంధనను తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దేశంలోని అన్ని కోర్టులు, పోలీసు అధికారులు దీన్ని పాటించాలని ఆదేశించింది. ఇలా చేయడం బెయిల్ మం జూరు చేసే ఉద్దేశానికి పూర్తి విరుద్దమని తెలిపింది.

“బెయిల్‌పై విడుదలైన నిందితుల గూగుల్ మ్యాప్ లొకేషన్ అడగడం వ్యక్తుల గోప్యతా హక్కుకు విరుద్ధం. బెయిల్ మంజూరు చేసిన ఉద్దేశ్యానికి కూడా ఇది పూర్తి విరుద్ధం. బెయిల్‌పై ఉన్నంత మాత్రాన నిందితుడి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునే హక్కు పోలీ సులకు లేదు.” అని ధర్మాసనం అభిప్రాయపడింది. డ్రగ్స్ కేసులో ఫ్రాంక్ విటస్ అనే నైజీరి యన్ 2022లో అరెస్టయ్యాడు. అనంతరం ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, అతని గూగుల్ మ్యాప్ లొకేషన్ పంపించాలని పోలీసు అధికారులు ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా తాజా తీర్పు వెలువడింది.