* పరువు నష్టం కేసులో క్రిమినల్ విచారణ నిలిపివేత
జనవరి 20: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణ ను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది.
రాహుల్ గాంధీపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేసింది. మరోవైపు జార్ఖండ్ హైకో ర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ దాఖలు చేసిన లీవ్ పిటిషన్‌ను విక్రమ్‌నాథ్, సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు ధ ర్మాసనం విచారించింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ వాదన లు వినిపిస్తూ బాధిత వ్యక్తి మాత్రమే పరువు నష్టం ఫిర్యాదును దాఖలు చేయగలరన్నారు.