calender_icon.png 25 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేటీఎంకు ఊరట

24-10-2024 12:00:00 AM

కొత్త యూపీఐ యూజర్ల చేరికకు ఎన్‌పీసీఐ అనుమతి

న్యూఢిల్లీ, అక్టోబర్ 23:  ఈ ఏడాది తొలినాళ్లలో రిజర్వ్‌బ్యాంక్ నియంత్రణలకు గురైన పేటీఎంకు ఊరట కల్పిస్తూ కొత్తగా యూపీఐ యూజర్లను చేర్చుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) తాజాగా అనుమతి ఇచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన పేటీఎం యూప్‌లో కొత్త యూజర్లను చేర్చుకోరాదంటూ ఆర్బీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ)గా అప్పటికే ఉన్న యూజర్లతో యూపీఐలో  పాల్గొనేందుకు ఈ ఏడాది మార్చిలో  నాలుగు బ్యాంక్‌లు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు కొనసాగించేందుకు పేటీఎంను ఎన్‌పీసీఐ అనుమతించింది.

తాజాగా వివిధ మార్గదర్శకాలకు, సర్క్యులర్లకు లోబడి కొత్త యూపీఐ యూజర్లను చేర్చుకోవడానికి అనుమతిస్తూ ఎన్‌పీసీఐ లేఖ ద్వారా తెలిపిందని పేటీఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్స్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. 

నికరలాభం రూ. 928 కోట్లు

ఒన్ 97 కమ్యూనికేషన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రూ.928 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 290 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. ఒన్ 97 కమ్యూనికేషన్ తన ఎంటర్‌టైన్‌మెంట్ టిక్కెటింగ్ వ్యాపారాన్ని జొమా టోకు విక్రయించడం ద్వారా సంపాదించిన లాభం కారణంగా తాజా త్రైమాసి కంలో నికరలాభాన్ని ప్రదర్శించగలిగింది.