హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్‌బాబు ఇటీవల సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో మోహన్‌బాబు దాఖలుచేసిన ముందుస్తు బెయిల్ పిటిషన్‌ను గత నెల 23ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.