calender_icon.png 14 February, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్‌పై దాడికేసులో మోహన్‌బాబుకు ఊరట

14-02-2025 01:17:36 AM

ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

హైదరాబాద్, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. గత డిసెంబర్ 10న జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి పరిసరాల్లో ఆయన్ను ప్రశ్నించిన ఓ టీవీ చానల్ విలేకరి చేతిలోని మైక్‌ను లాక్కొని దాడి చేశారంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీనిపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు డిసెంబర్ 23న కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ మోహన్‌బాబు సుప్రీంను ఆశ్రయించగా గురువారం విచారణకు వచ్చింది.

ఇది పూర్తిగా ఓ కుటుంబానికి చెందిన విషయమని, తండ్రికి, కొడుకుకు ఉన్న కుటుంబ వివాదమని, బయటి ప్రపంచానికి సంబంధం లేదని మోహన్‌బాబు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

గాయపడిన జర్నలిస్టు ఎలా ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా.. విలేకరి తరఫు న్యాయవాది పరిస్థితిని వివరించారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూ రు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 

హైకోర్టులో విచారణ వాయిదా

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలో విలేకరిపై దాడి ంఘటనకు సంబంధించి పహాడీ షరీఫ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ సినీనటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణను వాయి దా వేసింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టగా ఇందులో ఫిర్యాదుదారు అయిన మీడియా ప్రతినిధి కౌంటరు దాఖలు చేయకపోవడంతో వారం గడు వు మంజూరు చేస్తూ విచారణ వాయి దా వేశారు.

మోహన్‌బాబు తరఫు న్యా యవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని చెప్పగా ఉత్తర్వుల కాపీని అందజేయాలంటూ న్యాయమూర్తి ఆదేశించారు.