calender_icon.png 20 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదర్సాలకు ఊరట

22-10-2024 02:50:03 AM

ఎన్సీపీసీఆర్ ఉత్తర్వులపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: సుప్రీంకోర్టులో మదర్సాలకు ఊరట లభించిం ది. ఈ మేరకు ఎన్సీపీసీఆర్ చేసిన సిఫారసులపై అత్యున్నత న్యాయస్థా నం స్టే విధించింది. దేశవ్యాప్తంగా గు ర్తింపు లేని మదర్సాలకు రాష్ట్రాలు ఫం డ్స్ ఇవ్వొద్దని జాతీయి బాలల హక్కుల సంఘం సిఫారసు చేసింది. అలాగే గుర్తింపులేని మదర్సాలలో చదువుతు న్న స్టూడెంట్స్‌ను దగ్గరలో ఉన్న ప్రభు త్వ స్కూళ్లలో చేర్పించాలని సూచించింది. 

మదర్సాలలో విద్యాహక్కు చట్టాన్ని పాటించడం లేదని, అక్కడ చెప్పే చదువు స్టూడెంట్లలో జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగపడడం లేదని, అక్కడ బోధించేంది  జీవితంలో ఎందుకూ పనికిరాదని సుప్రీంకోర్టుకు ఇదివరకే ఎన్సీపీసీఆర్ తెలిపింది.

ఎన్సీపీసీఆర్ ఆదేశాలను తమ రాష్ట్రాల్లో అమలు చేయడానికి యూపీ, త్రిపుర రాష్ట్రాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ రెండు రాష్ట్రాల తీరును వ్యతిరేకిస్తూ జమియాత్ ఉలేమా హింద్ అనే ముస్లిం సంస్థ పిటిషన్ వేయడంతో ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఆదేశాలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.