calender_icon.png 26 December, 2024 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట

24-12-2024 12:23:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కేసీఆర్, హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ రాజలింగ మూర్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు ఈ ఏడాది జులై10వ తేదీన కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు పంపింది. ఈ కేసును కొట్టివేయాలని కేసీఆర్, హరీశ్ రావు డిసెంబర్ 23న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాల సరిగా లేవన్న హైకోర్టు న్యాయమూర్తి ఆ ఆర్డర్స్ ను సస్పెండ్ చేసింది. భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ కుంగుబాటుపై రివిజన్ పిటిషన్ ను స్వీకరించే అధికార పరిధి భూపాలపల్లి కోర్టుకు లేదని సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్, హరీశ్ రావు తరపు న్యాయవాది హైకోర్టులో ప్రస్తావించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను 2025 జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది.