calender_icon.png 12 January, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో హేమంత్‌కు ఊరట

30-07-2024 12:05:00 AM

న్యూఢిల్లీ, జూలై 29 : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు భారీ ఊరట లభించింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జార్ఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. సోరెన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకమైనదని జస్టిస్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. భూ కుంభకోణానికి సంబం ధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను జనవరి 31న ఈడీ అరెస్టు చేసింది.  జూన్ 28న హైకోర్టు బెయి ల్ మంజూరు చేయడంతో బిర్సా ముండా జైలు నుంచి విడుదలయ్యా రు. అనంతరం చంపై సోరెన్ స్థానం లో సీఎంగా పగ్గాలు చేపట్టారు.