21-03-2025 12:53:14 AM
హైదరాబాద్, మార్చి 20: మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాంగ్రె స్ నేత, సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీశ్‌రావుతో పాటు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై కేసు నమోదు చేశారు.
ఎఫ్‌ఐఆర్‌లో వారిద్దరినీ నిం దితులుగా పేర్కొన్నారు. తనపై న మోదైన తప్పుడు కేసును కొట్టేయాలంటూ మాజీమంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దర్యాప్తులో భాగం గా హరీశ్‌రావును అరెస్ట్ చేయొద్దం టూ కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో ఇరువైపుల వాదనలు ముగిసిన నేపథ్యంలో గు రువారం ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది.