హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను వచ్చే నెల 2 వరకు అరెస్ట్ చేయరాదని శుక్రవారం హైకోర్టు వరంగల్ పోలీసులకు ఆదేశాలిచ్చింది. మరోవైపు దర్యాప్తును కొనసాగించవచ్చని కూడా సూచి ంచింది. బీఆర్‌ఎస్ ఈ నెల 25న చేపట్టనున్న నిరసన కార్యక్రమానికీ శంకర్‌నాయక్ హాజ రు కావొచ్చని స్పష్టం చేసింది.
ఒక సివిల్ వివాదంలో ఆయనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరుతూ శంకర్‌నాయక్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ కె. లక్ష్మణ్ కేసును విచారించారు. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత శంకర్‌నాయక్‌పై కేసు నమోదైందని, మొదట దాఖలు చేసిన కేసులో శంకర్‌నాయక్‌ను నిందితుడిగా పేర్కొనలేదని, దీంతో ఆయన్ను అరెస్ట్ చేయరా దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.