calender_icon.png 27 April, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట

27-04-2025 12:19:43 AM

  1. బహిష్కరణపై వెనక్కి తగ్గిన ట్రంప్
  2. విద్యార్థుల చట్టబద్ధ హోదాకు తాత్కాలిక పునరుద్ధరణ

న్యూయార్క్, ఏప్రిల్ 26: అమెరికాలోని విదేశీ విద్యార్థుల బహిష్కరణ విషయంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. దీంతో ఉన్నత విద్య కోసం అమెరి కా వెళ్లి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న వందలాది విదేశీ విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. చిన్న తప్పిదాలకే తమ వీసాల రద్దుపై కోర్టులను ఆశ్రయించిన అక్క డి విద్యార్థులకు న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పునివ్వడం విశేషం.

అక్రమ వలస దారులపై కఠినంగా వ్యవహిరిస్తోన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వివిధ కారణాలతో 187 కాలేజీలకు చెందిన 1200 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసా లేదా చట్టబద్ధ హోదాలను రద్దు చేసింది. దీంతో డిపోర్టేషన్, నిర్బందం ముప్పు పొంచి ఉండడంతో ఆ విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. వీరిలో కొంతమంది అమెరికాను కూడా వీడారు.

అయితే కొంత మంది విద్యార్థులు తమ వీసాల రద్దుపై కాలిఫోర్నియా, బోస్టన్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరి పిన ఆయా న్యాయస్థానాలు విద్యార్థుల వీసా రద్దును ఆపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విద్యార్థుల చట్టబద్ధ హోదాను తాత్కాలికంగా పునరుద్ధరించింది.