- ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
- స్వచ్ఛంద సంస్థలు, పార్టీల మానవత్వం
- ఇంకా బురదలోనే ఇళ్లు, కాలనీలు
- మళ్లీ వర్షాల నేపథ్యంలో ఆందోళన
ఖమ్మం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఖమ్మం మున్నేరు వరద ప్రాంతాల్లో వరద సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలు, పార్టీల నేతలు కదలివచ్చి, వరద బాధితు లకు తోచిన సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. మున్నేరు శివారు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా శానిటేషన్ కార్యక్రమాలు పూర్తి చేశామని చెప్తున్నా.. వాస్తవానికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ప్రజలు బురద, ఇసుక మేట ఉన్న ఇళ్లలోనే తలదాచుకుంటున్నారు. పూర్తి స్థాయిలో శానిటేషన్ కార్యక్రమాలు పూర్తి కాలేదు.ఫైర్ సిబ్బంది, ప్రభుత్వం నియమించిన సిబ్బంది రోడ్లు శుభ్రం చేయడం మినహా ఇళ్లన్నీ బుర దలోనే ఉన్నాయి. చాలాచోట్ల ప్రజలే సొం తంగా శుభ్రం చేసుకుంటున్నారు.
నాలుగు రోజులుగా అవే బట్టలు
వరద బాధితుల పరిస్థితి ఘోరంగా ఉంది. వరదల కంటే ముందు ధరించిన బట్టలే వారి ఒంటి మీద ఉన్నాయి. ఇళ్లల్లో ఉన్నవన్నీ నీటితో తడిచి, కొట్టుకు పోయాయి. రాజీవ్ గృహ కల్ప, బొక్కలగడ్డ, ప్రకాశ్‌నగర్, వెంకటేశ్వరనగర్, మోతీనగర్, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతా ల్లో జన జీవనం స్తంభించే కనిపించింది. అయితే, స్వ చ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల వారు ముం దుకు వచ్చి బాధితులకు సాయం అందిస్తున్నారు.
భోజనాలు వండి పెట్టడం, వంట సామగ్రి, నిత్యావసర వస్తు వులు, దుస్తులు, దుప్పట్లు అందిస్తున్నారు. సీపీఎం, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కూడా మూడు రోజులుగా ఫుడ్ ప్యాకెట్స్ పంచు తున్నారు. బీజేపీ నేతృత్వం లో దుప్పట్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, రెండు జతల దుస్తులు కూడా పంచుతున్నారు. పూర్తి స్థాయిలో పరిస్ధితి అదుపులోకి రావాలంటే వారం రోజులకు పైగానే పడుతుందంటున్నారు.
గురువారం వానతో భయాందోళన
మరోవైపు గురువారం నుంచి నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుండటంతో మున్నేరు శివారు ప్రాంతాల ప్రజలు మళ్ళీ భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి వచ్చి, ఇళ్లను శుభ్రం చేసుకుంటూ, సర్దుకుంటున్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలతో భయపడుతున్నారు.
వరద బాధితులకు పొంగులేటి ట్రస్ట్ సాయం
పాలేరు నియోజకవర్గ ముంపు బాధితులకు పొంగులేటి స్వరాజ్యం రాఘవ రెడ్డి ట్రస్ట్ తరఫున సాయం చేయాలని మంత్రి పొం గులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని ముం పు బాధితులకు నాలుగు రోజలుగా ఆహార పానీయాలను ఉదయం, సా యంత్రం పంపిణీ చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి బాధితులకు బియ్యం, పప్పు, నూనె, కారం, చింత పండు,ఉల్లిగడ్డలు ఇలా పది రోజుల కు సరిపడా నిత్యావసరాలతోపాటు మహిళలకు చీరలు, పురుషులకు లుంగీలు, టీషర్ట్‌లతోపాటు కండు వాలు, బెడ్ షీట్లు పంపిణీ చేసేందు కు ఏర్పాట్లు చేస్తున్నారు.