calender_icon.png 20 September, 2024 | 2:57 PM

ఓటుకు నోటు కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

20-09-2024 12:33:33 PM

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులపై 2015లో జరిగిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ పనితీరులో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు రెడ్డిని ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ తెలంగాణ సీఎంకు నివేదించరాదని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.

ఓటుకు నోటు కేసును బదిలీ చేయాలన్న జగదీశ్ రెడ్డి విజ్జప్తిని సర్వోన్నతన్యాయం తోసిపుచ్చింది. ఊహాజనితమైన అంశాలతో పిటిషన్ దాఖలు చేశారని సుప్రీం కోర్టు తెలిపింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేశారని పేర్కొంది. సీఎం, హోంమంత్రిగా ఉన్న రేవంత్ కు ఏసీబీ డీజీ రిపోర్టు చేయనక్కర్లేదని కోర్టు వెల్లడించింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ చేయాలని పేర్కొంది. ఓటుకు నోటు కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోకూడదని తెలిపారు. కేసు విచారణపై విశ్రాంత జడ్జి పర్యవేక్షణకూ సుప్రీం కోర్టు నిరాకరించింది.

భవిష్యత్ లో సీఎం జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్గొచ్చన్నారు. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డికి సుప్రీం పలు సూచనలు  చేసింది. తమ తీర్పులపై అభిప్రాయం చేప్పే హక్కు అందరికీ ఉందని తెలిపింది. ప్రజాజీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలని సూచించింది. తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును క్షమాపణ కోరారు. కవిత బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిలు, లాయర్లపై సీఎం వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు, పోస్టుపలై సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రస్తుతదశలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు విచారణ ముగించింది.