హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే
ఆదిలాబాద్, మే 17 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మె ల్సీ ఎన్నిక చెల్లదని ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం జులైకి వాయిదా వేసింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థ ల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామి నేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తి రెడ్డి రాజేశ్వర్‌రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు.
దండె విఠల్ ఎన్నిక సరైనది కాదని, ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. కాగా, ఎన్నికను రద్దు చేయడంతోపాటు దండె విఠల్‌కు న్యాయస్థానం రూ.50 వేల జరిమానా విధించింది. దీంతో హై కోర్టు తీర్పును ఎమ్మెల్సీ విఠల్ సుప్రీం కోర్టులో చాలెంజ్ చేశారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.