calender_icon.png 4 January, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనిల్ అంబానీ కంపెనీకి ఊరట

04-12-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: అనిల్ అంబాన గ్రూప్ కంపెనీ రిలయన్స్ పవర్‌కు ఊరట లభించింది. తాము జారీచేసే టెండర్లలో పాల్గొనరాదంటూ ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (ఎస్‌ఈసీఐ) గతంలో రిలయన్స్ పవర్‌కు జారీచేసిన నోటీసును ఉపసంహరిం చుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించింది.

దీంతో ఎస్‌ఈసీఐ భవిష్య త్తులో జారీచేసే టెండర్లలో పాల్గొనే అవకాశం రిలయన్స్ పవర్‌కు లభిస్తుంది. నకిలీ డాక్యుమెంట్లు సమర్పిం చారని ఆరోపిస్తూ రిలయన్స్ పవర్, రిలయన్స్ నుబెస్‌లు తమ టెండర్లలో మూడేండ్లపాటు పాల్గొనకుండా నవంబర్ నెలలో ఎస్‌ఈసీఐ నిషేధం విధించింది. రిలయన్స్ నుబెస్ మినహా తన సబ్సిడరీలు అన్నీ ఎస్‌ఈసీఐ భవిష్యత్తులో జారీచేసే టెండర్లలో పాల్గొనవచ్చని రిలయన్స్ పవర్ మంగళవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది.