calender_icon.png 29 November, 2024 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిషితేశ్వరి కేసులో నిందితులకు ఊరట

29-11-2024 08:00:16 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు ఊరట లభించింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. తన ఆత్మహత్యకు ర్యాగింగే కారణమంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది. రిషితేశ్వరి నాగర్జున యూనివర్సిటీలో చదివింది. కాలేజీలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే పార్టీలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు, సీనియర్ విద్యార్థులు మధ్యం సేవించి తనతో అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం సీనియర్లు యువతిపై ర్యాంగింగ్ కు పాల్పడ్డారు.

దీంతో యువతి మనస్థానం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో తెలిపింది. ఈ లేఖ ఆధారంగా పలువురు నింధితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ  దాదాపు 9 ఏళ్లపాటు కొనసాగింది. అయితే సరైన సరైనా సాక్షాలు లేకపోవడంతో రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు శుక్రవారం కొట్టివేసింది. కేసును కోర్టు కొట్టేయడంతో యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం పోరాటం చేస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలుస్తామని చెప్పారు. తమ కుతూరికి న్యాయం జరగకపోతే మరణమే శరణ్యమని యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు.