calender_icon.png 2 April, 2025 | 3:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిషేక్ మహంతికి హైకోర్టులో ఊరట

25-03-2025 12:35:10 AM

క్యాట్‌లో విచారణ ముగిసేవరకు రిలీవ్ చేయొద్దంటూ న్యాయస్థానం ఆదేశాలు 

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. క్యాట్‌లో విచారణ తేలేవరకు తెలంగాణ నుంచి ఆయన్న రిలీవ్ చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల అభిషేక్ మహంతిని కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని ఆదేశించింది.

కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహంతి క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌లో విచారణ పూర్తయ్యే వరకు రిలీవ్ చేయొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆయన పిటిషన్‌ను త్వరగా తేల్చాలని హైకోర్టు క్యాట్‌ను ఆదేశించింది.