calender_icon.png 19 April, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహాయక చర్యలు సమర్థంగా సాగాలి

25-03-2025 12:00:00 AM

  1. ఏడుగురు కార్మికుల ఆచూకీ కనిపెట్టాలి
  2. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి
  3. రెస్క్యూ ప్రత్యేకాధికారిగా శివశంకర్ నియామకం 
  4. ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ సమర్థంగా సాగాలని, సొరంగంలో చిక్కుకున్న ఏడుగురు కార్మికు ల ఆచూకీ కనిపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.  అసెంబ్లీ కమిటీ హాల్‌లో సోమవారం ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిర్వ హించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

సహాయక చర్యల పర్యవేక్షణకు ఐఏఎస్ శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సహాయక చర్యలను సీఎంకు వివరించారు. సహాయక చర్యల్లో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం 25 ఏజెన్సీలకు చెందిన 700 మంది సిబ్బంది పాల్గొం టున్నారని తెలిపారు.

సొరంగంలో కూలిన రాళ్ల ను యంత్రాలతో తొలగిస్తున్నామని, పెద్ద పెద్ద యంత్రాలను వెల్డింగ్ ద్వారా ముక్కలు చేస్తున్నామన్నారు. పూడిక, నీటి ఊట కారణంగా రెస్క్యూ సంక్లిష్టంగా మారిందన్నారు. సొరంగంలో 14 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు సిబ్బంది గాలి, వెలుతురు సమస్య పెద్ద సవాలుగా మారిందన్నారు.

ప్రమా దం సంభవించిన స్థలంలో ఓ 30 మీటర్ల ప్రాం తం అత్యంత ప్రమాదకర జోన్‌గా గుర్తించామని స్పష్టం చేశారు. ఆ స్థలంపై జీఎస్‌ఐ, ఎన్జీఆర్‌ఐ సం స్థలు శాస్త్రీయ అధ్యయనాలు చేస్తున్నాయని, వారి సూచనల మేరకు రెస్క్యూ కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రిమ మాట్లా డు తూ.. అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వేషించాలని సూ చించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ ఇన్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ విభాగ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్జీఆర్‌ఐ, జీఎస్‌ఐ, సింగరేణి ప్రతినిధులు పాల్గొన్నారు.