calender_icon.png 17 January, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలయన్స్ లాభం రూ.18,540కోట్లు

17-01-2025 01:58:08 AM

ఆదాయం రూ. 2.40 లక్షల కోట్లు

న్యూఢిల్లీ,  జనవరి 16: దేశంలో అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024 అక్టోబర్ మూడో త్రైమాసికంలో రూ. 18,540 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. గురువారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు రిలయన్స్ ఆయిల్, గ్యాస్ వ్యాపారం, రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వ్యాపారాల ఆర్థిక ఫలితాల్ని ఆమోదించింది. 

గత ఏడాది క్యూ3లో నమోదైన రూ.17,365 కోట్లకంటే ఈ క్యూ3లో 7.4 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 6.7 శాతం వృద్ధితో రూ.2.25 లక్షల కోట్ల నుంచి రూ. 2.40 లక్షల కోట్లకు చేరింది. ఇబిటా రూ.40,656 కోట్ల నుంచి 8 శాతం పెరిగి రూ.43,789 కోట్లకు చేరింది. ఇబిటా మార్జిన్ 18.3 శాతానికి మెరుగుపడింది. 

ఓ2సీ వ్యాపారం

రిలయన్స్ ఆయిల్ టు కెమికల్స్( ఓ2సీ)వ్యాపారం ఆదాయం రూ.1,41,096 కోట్ల నుంచి రూ. 1,49,595 కోట్లకు చేరింది. అయితే స్వీక్వెన్షియల్‌గా ఇది తగ్గింది. 

రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్

రిలయన్స్ డిజిటల్ సర్వీసుల సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ ఆదాయం 19 శాతం పెరిగి రూ.33,074 కోట్లకు చేరింది. నికరలాభ 26 శాతం వృద్ధితో రూ. 6,861 కోట్లకు చేరింది. రూ.16,585 కోట్ల ఇబిటా సాధించింది. ఏపీఆర్‌యూ మెరుగుదలతో ఇబిటా మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 50.1 శాతానికి చేరింది. రూ.203.3 ఏపీఆర్‌యూను నమోదు చేసింది.

రిలయన్స్ రిటైల్ వ్యాపారం

రిలయన్స్ రిటైల్ ఆదాయం క్యూ3లో రూ. 74,373 కోట్ల నుంచి రూ. 79,595 కోట్లకు పెరిగింది. నికరలాభం 10 శాతం వృద్ధిచెంది రూ.3,145 కోట్లకు చేరింది. ఇబిటా రూ.6,828 కోట్లకు పెరగ్గా, మార్జిన్ 8.4 శాతం నుంచి 8.6 శాతానికి మెరుగుపడింది. 

‘డిజిటల్ సర్వీసుల వ్యాపారం భారీగా వృద్ధిచెందింది. చందాదారుల్ని పెంచుకున్నాం. 5జీ నెట్‌వర్క్స్‌లోకి మారే చందాదారులు పెరిగారు. పండుగ సీజన్లో వినియోగ మెరుగుపడటంతో రిటైల్ వ్యాపారం ఊపందుకున్నది. 

 అంబానీ చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్