calender_icon.png 28 October, 2024 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్విక్‌కామర్స్‌లోకి రిలయన్స్ రిటైల్

27-06-2024 01:55:56 AM

న్యూఢిల్లీ, జూన్ 26: ఒక గంటలోపే సరుకుల్ని డెలివరీ చేసే క్విక్‌కామర్స్ విభాగంలోకి రిలయన్స్ రిటైల్ అడుగుపెట్టింది. క్విక్‌కామర్స్‌లో ప్రస్తుతం బ్లింకిట్, స్విగ్గీఇన్‌స్టామార్ట్, జెప్టోలు 10 నిముషాల్లోనే కిరాణా సామగ్రి, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను చేరవేస్తూ ఆధిపత్యం చెలాస్తున్నాయి. నిరుడు జియోమార్ట్ ఎక్స్‌ప్రెస్ పేరుతో క్విక్‌కామర్స్‌లో ఒక పైలెట్ ప్రాజెక్టు చేపట్టిన రిలయన్స్ అటుతర్వాత దానిని రద్దుచేసింది. తాజాగా రిలయన్స్ రిటైల్ గ్రాసరీ, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల తక్షణ డెలివరీకి ముంబై, నవీముంబై ప్రాంతాల్లో ఒక పైలెట్‌ను ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఫాస్ట్ డెలివరీ సర్వీసును జియోమార్ట్ మొబైల్ అప్లికేషన్‌తో రిలయన్స్ రిటైల్ ఇంటిగ్రేట్ చేసింది. తదుపరి రోజుల్లో ఇతర ప్రాంతాలకు కూడా సర్వీసుల్ని విస్తరించనుంది.