calender_icon.png 15 January, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్ ఇష్యూకు రిలయన్స్ బోర్డు ఆమోదం

06-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఇన్వెస్టర్లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు జారీచేసే ప్రతిపా దనను గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఏడేండ్ల తర్వాత రిలయన్స్ బోనస్ ఇష్యూను ప్రకటిం చడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు 2017 సెప్టెంబర్‌లో బోనస్ షేర్లను కంపెనీ జారీచేసింది. రూ.10 ముఖవిలువగల ప్రతీ ఈక్విటీ షేరుకు మరో కొత్త షేరును బోన స్‌గా జారీచేసే ప్రతిపాదనను తమ బోర్డు ఆమోదించిందని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. షేర్ల జారీకి రికార్డు తేదీని తదుపరి రోజుల్లో వెల్లడిస్తుంది.