calender_icon.png 14 October, 2024 | 2:00 AM

చిక్కుల్లో రిలయన్స్, డిస్నీస్టార్ విలీనం

21-08-2024 12:30:00 AM

  1. పోటీ మార్కెట్‌కు అవరోధమన్న సీసీఐ 
  2. క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులపట్ల ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రిలయన్స్, వాల్ట్ డిస్నీల 8.5 బిలియన్ డాలర్ల విలీన ప్రక్రియ చిక్కుల్లో పడింది. క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులపై ఈ రెండు పూర్తి ఆధిపత్యం వహిస్తున్న దున పోటీ మార్కెట్‌కు అవరోధం కలుగుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండి యా (సీసీఐ) ఆందోళన వ్యక్తంచేస్తూ, ప్రతిపాదిత విలీనంపై ఎందుకు దర్యాప్తు చేయకూ డదో కారణాలు తెలపాలంటూ ఇరు కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీచేసింది.

క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యం కారణంగా రిలయన్స్, వాల్డ్ డిస్నీ విలీన కంపెనీకి ధరల్ని నిర్ణయించే శక్తి, అడ్వర్‌టైజింగ్‌ను శాసించే శక్తి ఉంటాయని సీసీఐ భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశమై డిస్నీ, రిలయన్స్‌లతో సీసీఐ ప్రైవేటుగా చర్చలు జరిపి, దర్యాప్తు ప్రారంభిస్తామని హెచ్చరించినట్టు ఆ వర్గాలు వివరించాయి. రిలయన్స్, డిస్నీ విలీన సంస్థ టీవీ చానళ్లు, స్ట్రీమింగ్ కంపెనీలైన సోనీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లతో పోటీ పడుతుంది.

10 చానళ్ల అమ్మకానికి డిస్నీ, ఆర్‌ఐఎల్ సిద్ధం

విలీనానికి సంబంధించి రిలయన్స్, డిస్నీలను సీసీఐ చర్చల సందర్భంగా 100 ప్రశ్నలను సంధించిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరితంగా సీసీఐ ఆమోదం పొందేందుకు తాము 10 టెలివిజన్ చానళ్లను విక్రయించడానికి సిద్ధమంటూ ఇరు కంపెనీలు ఆఫర్ చేసినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. షోకాజ్‌పై 30 రోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ రిలయ న్స్, డిస్నీలకు సీసీఐ ఆదేశించినట్టు సమాచారం.