calender_icon.png 23 October, 2024 | 11:26 PM

ఆగస్టు 2న విడుదల

12-07-2024 12:05:00 AM

* విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకె క్కిస్తున్న ఈ చిత్రా న్ని కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాశ్, మురళీ శర్మ, శరణ్య పొన్వన్నన్ పలు పాత్రల్లో నటిస్తున్నారు.  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్టు మేకర్స్ గురువారం ప్రకటించారు. ‘తనను చిన్న చూపు చూసే సమాజంలో భవితను మార్చిన ఓ వ్యక్తి కథే ఈ సినిమా కాగా, ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ మూవీ షూటింగ్‌ను అండమాన్, డయ్యూ డామన్‌లలో జరిపారు. 

* రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తా జా చిత్రం ‘తిరగబడర సామీ’. మాల్వీ మల్హో త్రా కథానాయిక. ఏ ఎస్ రవికుమార్ చౌద రి దర్శకత్వంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మన్నారా చోప్రా ఈ చిత్రంలో విభిన్న పాత్రలో నటిస్తూ ప్రత్యేక గీతంతో అలరించనుండగా, మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘుబాబు, అంకిత ఠాకూర్, పృథ్వీ, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: జేబీ, భోలే షావలి; గీత సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి; డీవోపీ: జవహర్ రెడ్డి ఎంఎన్; ఫైట్స్: పృథ్వీ, కార్తీక్.