calender_icon.png 6 February, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూరాలకు నీటిని విడుదల చేయండి

06-02-2025 01:40:29 AM

కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ మంత్రుల బృందం విజ్ఞప్తి

బెంగళూరు, ఫిబ్రవరి 5: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే జూరాల ప్రాజెక్టు వేగంగా అడుగంటుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయాలని కోరుతూ ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేశారు.

ఫిబ్రవరి 4 నాటికి జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు 1.7 టీఎంసీలకు పడిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే సాగు, తాగు నీటి కొరత ఏర్పడనుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి కర్ణాటక వెళ్లి అక్కడి ప్రభుత్వానికి సమస్యను వివరించారు.