calender_icon.png 22 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్ల రైతులను విడుదల చేయండి

22-01-2025 02:59:45 AM

  1. ఒకే ఘటనపై నాలుగు కేసులు ఎందుకు? అంటూ ప్రశ్న
  2. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాం తి): ఫార్మాసిటీ భూసేకరణ  వివాదంలో నమోదైన కేసుల్లో ఒక కేసులో బెయిల్ ఉండగా అదే సంఘటనకు చెందిన ఇతర కేసుల్లో అరెస్ట్ చేసిన నలుగురు రైతులను విడుదల చేయాలని సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌కు  హైకోర్టు మంగళవారం  ఆదేశాలు జారీ చేసిం ది. ఒక్కొక్కరి నుంచి రూ.25 వేలు వ్యక్తిగత పూకత్తు తీసుకుని విడుదల చేయాలని ఆదేశించింది.

లగచర్లలో అధికారులపై దాడికి సంబం ధించి పోలీసులు మూడు కేసులు నమోదు చేయగా ఒక కేసులో బెయిల్ రాగా విడుదలైన మరుసటి రోజే అరెస్ట్ చేశారని, కేసులను కొట్టివేసి విడుదల చేయాలని  ఎమ్ రమేశ్, ఎమ్ గోపాల్ నాయక్,  ఎమ్ మాధరయ్య, పి. మంగ్యానాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్  విచారణ  చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బొమ్రాస్పేట  పోలీసులు నమోదు చేసిన 153, 154, 155 కేసుల్లో పిటిషనర్లు నిందితులుగా ఉన్నారన్నారు.  కేసు నెం. 153లో పిటిషనర్లను నవంబర్ 16న అరెస్ట్ చేశారని, హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జనవరి 8న విడుదలయ్యారన్నారు. అయితే పోలీసులు జనవరి 9న 154, 155 కేసుల్లో తిరిగి అరెస్ట్ చేశారని తెలిపారు.  

పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ లగచర్ల గ్రామస్తులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పిటిషనర్లపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వారికి వ్యతిరేకంగా స్పష్టమైన ఆరోపణలున్నాయని,  ఇరుపక్షాల వాదనలను, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి గ్రామస్తులు ఇచ్చిన వాం గ్మూలాల్లో పిటిషనర్ల పేరు తప్ప మరేమీ ప్రత్యేకంగా కనిపించడంలేదన్నారు.

నేరాల్లో కూడా వారి పాత్ర గురించి ఏమీ లేదని, అందులోను పిటిషనర్లు రైతులని పేర్కొన్నారు. నవంబర్ 16 నుంచి జనవరి 8వరకు, తిరిగి 9 నుంచి జైలులోనే ఉన్నారన్నారు. ఒకే సంఘటనపై వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ మూడు కేసుల్లో ప్రధాన నిందితుడు పట్నం నరేందర్‌రెడ్డి  వేసిన పిటిషన్‌ను అనుమతించి ఒక్క కేసునే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు.  

ఇదే కేసుల్లో పిటిషనర్లు కూడా నిందితులుగా ఉన్నారని, ఒక కేసులో బెయిల్ మంజూ రు చేయగా విడుదలైన వెంటనే మిగిలిన కేసుల్లో అరెస్ట్ చేసిన అంశంపై పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు.  దీనిపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి  12కు వాయిదా వేస్తూ పిటిషనర్లను విడుదల చేయాలని ఆదేశించారు.