యాదాద్రిభువనగిరి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రక్తతకు దారితీసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థ్ధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థి నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు శివ, రాజు, నాగరాజు, రాహుల్, శ్రీనివాస్, జగన్, ఉదయ్, భవానీ శంకర్, కీర్తన, మమత పాల్గొన్నారు.