చర్లపల్లి జైలు వద్ద కుటుంబసభ్యుల కోలహలం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి) : చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమమైంది. దీంతో, బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ఖైదీలను చర్లపల్లి జైలుకు తీసుకొచ్చి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి ఖైదీలను విడుదల చేశారు. ఖైదీల కోసం వచ్చిన కుటుంబసభ్యులతో చర్లపల్లి జైలు ఆవరణలో కోలాహలం నెలకొంది.