calender_icon.png 12 January, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సౌలభ్యానికే సాగునీటి విడుదల

12-01-2025 12:51:23 AM

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్’కుమార్

జగిత్యాల, జనవరి 11 (విజయ క్రాంతి): ప్రస్థత రబీ సీజన్ పంటల నేపథ్యంలో రైతుల సౌలభ్యం కోసమే సాగు నీటిని విడుదల చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్’కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని దమ్మన్నపేట, రాజా రాం, జైన తదితర గ్రామాల్లో పర్యటిం చారు.

ఆ ప్రాంత రైతులను కలిసి మాట్లాడి, సమస్యలు తెలుసుకున్న అనంతరం, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్’రెడ్డితో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూ డదనే ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్’రెడ్డి లతో మాట్లాడి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయించడం జరిగిందన్నారు.

విడుదలైన నీరు గోదావరి ద్వార ఈ ప్రాంత రైతాం గానికి ఈ రోజు అందనుందని వివరిం చారు. గత పాలకుల స్వార్థం, నిర్లక్ష్యం మూలంగా రబీ సీజన్ రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారిందన్నారు.   అయినప్పటికీ సాగునీటికి ఇబ్బంది లేకుండా సీఎం రేవంత్ రెడ్డి లక్ష ఎకరాలకు నీరందించేం దుకు  పకడ్బందీగా ముందస్తు చర్యలు చేపట్టారని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క ప్రాంతంలో కూడా రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు ’రుణ మాఫీ’ చేస్తున్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు.

ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా ఈ నెల 26 నుండి ’రైతు భరోసా’ అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తాము కోరగానే ఒక టీఎంసీ నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్’రెడ్డికి, మంత్రి ఉత్తంకుమార్’రెడ్డికి ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు.

కాగా రైతులు సాగునీటిని వృధా చేయకుండా సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే జాగ్రత్తగా వినియోగించుకోవాలని లక్ష్మణ్’కుమార్ రైతులను కోరారు