calender_icon.png 6 November, 2024 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

06-11-2024 02:11:07 AM

ఆలస్య రుసుముతో 

డిసెంబర్ 27 వరకు అవకాశం

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): ఇంటర్ వార్షిక పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను మంగళవారం ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులకు రూ.520, వొకేషనల్ విద్యార్థులకు రూ.750, ద్వితీయ సంవత్సరం జనరల్, ఆ ర్ట్స్ విద్యార్థులకు రూ.520, జనరల్ సైన్స్, వొకేషనల్ వాళ్లకు రూ.750 ఫీజుగా నిర్ణయించారు. బుధవారం నుంచి ఈనెల 26 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఆలస్య రుసుముతో డిసెం బర్ 27 వరకు అవకాశం కల్పించారు.

రూ. 100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వర కు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.1,000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 18 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.2వేల జరిమానాతో డిసెంబర్ 27 వరకు పరీక్ష ఫీజును చెల్లించే అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజును స్వల్పంగా పెంచా రు. గతంలో ఫస్టియర్ విద్యార్థులకు రూ. 510 ఉండగా ఇప్పుడు దాన్ని 520 చేశారు. అలాగే  సెకండియర్  విద్యార్థులకు రూ.73 0 ఉండగా ఇప్పుడు దాన్ని 750 చేశారు.