calender_icon.png 16 January, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

14-09-2024 12:14:06 AM

  1. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితా
  2. 14వ తేదీ నుంచి అభ్యంతరాల స్వీకరణ 
  3. ఈ నెల 28న తుది ఓటర్ల జాబితా ప్రకటన 

హైదరాబాద్,సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు  మరో అడుగు పడింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శుక్రవారం పంచాయతీల వారీగా ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. గ్రామపంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లలో జాబితాను ప్రకటించినట్లు ఈసీ తెలిపింది. 14వ తేదీ నుంచి ఈ నెల 21 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు, 26వ తేదీన వాటిని పరిష్కరించనున్నట్లు ఈసీ పేర్కొన్నది. ముసాయిదా ఓటర్ల సవరణపై ఈనెల 18న జిల్లా స్థాయిలో, 19న మండల స్థాయిఓ రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. అనంతరం 28న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపింది.