పొనిశెట్టి వెంకటేశ్వర్లు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద, 6 అబద్దాలు.. 66 మోసాలు మీద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఛార్జి షీట్ విడుదల చేశారు. అనంతరం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సభ్యత్వ జిల్లా కన్వీనర్ పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సంవత్సరం క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వందరోజుల్లో ఇచ్చిన హామీలు తీరుస్తాం అని ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసినది అన్నారు. ఇల్లు లేని పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదల భూములు లాక్కునే పనిలో ఉందని అన్నారు.
విద్యార్థులకు నిరుద్యోగులకు పరీక్షా విషయంలో ఉద్యోగ కల్పన విషయంలో పూర్తిగా విఫలం అయినది అని అన్నారు. మహాలక్ష్మి అని మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేసిందని మహిళలకు ప్రతి నెల ఇస్తానన్న రూ.2500 జాడే లేదని అన్నారు. రైతులకు రాని భరోసా, రెండు లక్షల రుణమాఫీ అరకొర చేసి ప్రచారం మాత్రం భారీ ఎత్తున చేసుకుంటున్న మాయ ప్రభుత్వం అన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు 12000 భృతి వారికీ 500 బోనస్ అమలులో పూర్తిగా విఫలం అని అన్నారు. వృద్దులకు ప్రతి నెల రూ 4000 వేల పెన్షన్ ఇస్తానని మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం తద్వారా పేదలకు అందని ఉచిత వైద్య సహాయం అని అన్నారు. కెసిఆర్ హాయంలో దోపిడీకి కిటికీలు తెరిస్తే రేవంత్ ప్రభుత్వం తలుపులు తెరిచిందని అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం పరిస్థితి రెండిటికి చెడ్డ రేవుల ఉంది పరిస్థితి ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని గెలిచిన సిపిఐ పార్టీ శాసన సభ్యులు వారి అనుచర ఘనంకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వర్గ పోరు తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై పెద్ద ద్రుష్టి లేదని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ రెండు పార్టీల నాయకులు పోటీ పడి పైరవీలు తప్ప ప్రజా సంక్షేమం అభివృద్ధికి సంబందించిన విషయాలు గాలికి వదిలేసినారు అని అన్నారు.
పారిశ్రామిక ప్రాంతం అయిన కొత్తగూడెం నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్న అభివృద్ధి నోచుకోకపోవడానికి కారణం ఈ ప్రభుత్వ అనాలోచిత విధానాలే కారణం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో జరిగే అభివృద్ధి తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేది శూన్యం అని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు అని సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం పోయినది అని అందుకే బీజేపీ పార్టీ నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అందుకే ప్రజలు బీజేపీ పార్టీ సభ్యత్వాలు స్వచ్చందంగా తీసుకుంటున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తుందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ప్రజలకు సకాలంలో సంక్షేమ పథకాలు అందించాలని అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పాల్వంచ పట్టణ మాజీ అధ్యక్షులు గంధం ప్రసాద్ గౌడ్, ఎస్సి మోర్చ నాయకులు కటికల రంజిత్, పట్టణ ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి మాదారపు లక్ష్మణ్, గిరిజన మోర్చ జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్, కిషన్ మోర్చ మండల అధ్యక్షులు దాసరి రమేష్, మాజీ మండల ప్రధాన కార్యదర్శి ధరావత్ నరేష్, మల్లెల శ్రీను, జలీల్, మాలోత్ మురళి, తోట శ్రీను, గార్లపాటి కిరణ్, తంబళ్ళ వెంకన్న, కాండ్రతి శ్రీను, వరక సత్యం, అఖిల్ పాల్గొన్నారు.