calender_icon.png 27 February, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మీయ భరోసా నిధులు విడుదల

27-02-2025 02:45:21 AM

లబ్ధిదారుల ఖాతాల్లో రూ.39.74 కోట్లు జమ

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ రెండు జిల్లా లు కలిపి ప్రభుత్వం బుధవారం 66,240 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఆరువేల చొప్పున రూ. 39.74 కోట్లను జమ చేసింది. 

తాజా నిధులతో కలిపి ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వం ఇప్పటివరకు 83,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు చెల్లించింది. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి మండలంలో ఎంపిక చేసిన పైలెట్ గ్రామాల నుంచి లబ్ధిదారుల జాబితాను రూపొందించారు.  పథకం ప్రారంభం రోజునే 18,180 మందికి రూ.10. 9 కోట్లను చెల్లించింది.

అయితే ఈ పథకం ప్రారంభించిన కొన్ని రోజులకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసింది. ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలోని అర్హులందరికీ ఆత్మీయ భరోసా నిధులను జమ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.