మంత్రి ఉత్తమ్‌కు హరీశ్‌రావు లేఖ
సిద్దిపేట, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా రైతులకు యాసంగికి అవసరమైన సాగునీటిని విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుధవారం ఉత్తరం రాశారు. తెలం గాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల్లో సరిపడా నీరు ఉన్నప్పటికీ విడుదల చేయకుండా రైతులకు ఇబ్బందులు పెడుతున్నా రని విమర్శించారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ల ద్వారా మూడేండ్లు రైతులకు నీళ్లిచ్చామన్నారు.