12-04-2025 12:54:54 AM
సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోఛనీయమన్నారు.
కాంగ్రె స్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వి ద్యార్థులు సరైన భోజనం, వసతి, ఇతర సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. యాజమాన్యా లు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.