08-03-2025 11:19:45 PM
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పద్మశ్రీ హిల్స్‌లో స్థానికుల ఆందోళన...
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హిల్స్‌లో స్థానికులు మంచినీటి కోసం శనివారం రిలే దీక్ష చేపట్టారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో దీక్షకు పూనుకున్నారు. కాలనీ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌రెడ్డి, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు సాయిబాబాతో పాటు స్థానికులు పెద్ద ఎత్తున రిలే దీక్షలో పాల్గొన్నారు. తాము కొన్నేళ్లుగా మంచినీటి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌తో పాటు జలమండలి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. అధికారులు సమస్యను పరిష్కరించే వరకు తాము దీక్ష విరమించేది లేదని స్పఫ్టం చేశారు.