31-03-2025 12:19:03 AM
చేవెళ్ల , మార్చి 30: తమ భూములు తమకు ఇవ్వాలని శంకర్ పల్లి మండలం కొండకల్, వెలిమెల తండా శివారులోని గిరిజన ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు ఉగాది పండుగ రోజూ కొనసాగాయి. ఆదివారం దీ క్షలో పాల్గొన్న భూ బాధితులు మాట్లాడు తూ.. తాము ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 80 ఎకరాల బిలాదాఖలు భూముల రియ ల్ ఎస్టేట్ కంపెనీలు ఆక్రమించాయని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షలో పి.ల క్ష్మణ్, రవి, శంకర్, బాబు, లక్ష్మణ్, చందర్ రెడ్డి, గోపి, సోనిబాయి, వసుంధర, తులసి, గోమా, మున్న, శంకరమ్మ, మాణెమ్మ, పి.క విత, వెంకటయ్య, శాంతయ్య, కొండకల్ మా జీ వార్డు సభ్యుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మర్రివాగు రాజు, తండా వాసు లు, తదితరులు పాల్గొన్నారు.