calender_icon.png 20 April, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

65వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

11-04-2025 12:56:01 AM

పటాన్ చెరు/గుమ్మడిదల, ఏప్రిల్ 10 :గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నల్లవల్లి, కొత్తపల్లి, గుమ్మడిదలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం నాటికి రిలే నిరాహార దీక్షలు 65వ రోజుకు చేరుకున్నాయి. గుమ్మడిదలలో చేపట్టిన నిరసన దీక్షలో బొంతపల్లి లోని శ్యామ్ పిస్టింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు.

డంపింగ్ యార్డు ఏర్పాటును గుమ్మడిదల మండల ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం తక్షణమే డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించుకొని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా అవసరమైన నివేదికలను అధికారులకు అందజేస్తామని జేఏసీ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుమ్మడిదల రైతు జేఏసీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు కుమార్ గౌడ్, నరసింహారెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, అభిశెట్టి రాజశేఖర్, దోమడుగు బాల్ రెడ్డి, మద్దుల బాల్ రెడ్డి, ఐలేష్, హుస్సేన్, మంద భాస్కర్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, వాసుదేవ రెడ్డి, జైపాల్ రెడ్డి, సూర్యనారాయణ, ఉదయ్ కుమార్, యాదిరెడ్డి, రైతు జేఏసీ నాయకులు, పరిశ్రమ ఉద్యోగులు తదితరులున్నారు.